తిరుపతి పసిబిడ్డ మాయం కేసులో ట్విస్ట్.. ఆ మహిళ గర్భమే దాల్చలేదంటున్న ఆసుపత్రి డాక్టర్లు

తిరుపతి పసిబిడ్డ మాయం కేసులో ట్విస్ట్.. ఆ మహిళ గర్భమే దాల్చలేదంటున్న ఆసుపత్రి డాక్టర్లు
x
Highlights

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పసిబిడ్డ మాయం కలకలం రేపుతుంది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన శశికళను అడ్మిట్‌ చేసుకున్న ఆస్పత్రి వైద్యులు.....

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పసిబిడ్డ మాయం కలకలం రేపుతుంది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చిన శశికళను అడ్మిట్‌ చేసుకున్న ఆస్పత్రి వైద్యులు.. కడుపులో బిడ్డ లేదంటూ, తమను మోసం చేస్తున్నారని శశికళ కుటుంబసభ్యులపై మండిపడ్డారు. అంతేకాదు.. శశికళ, ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే బిడ్డను మాయం చేసి తమపై దాడి చేశారని శశికళ కటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక గ్రామంలో శశికళకు శ్రీమంతం జరిపామంటూ బాధిత కటుంబసభ‌్యులు తెలియజేస్తున్నారు. అంతేకాదు శశికళ శ్రీమంతం ఫోటోలు కూడా విడుదల చేశారు శశికళ కుటుంబసభ్యులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అసలు శశికళ గర్భం దాల్చిందా లేదా అన్న కోణంలో విచారణ చేపట్టారు.

అటు తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్ద డాక్టర్లకు, శశికళ కుటుంబసభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. గర్భంలోని శిశువును మాయం చేసి బుకాయిస్తున్నారని మహిళ బంధువులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మహిళకు వచ్చింది గర్భం కాదని.., వైద్య పరీక్షలో గాలి బుడగలు ఉన్నట్టు నిర్ధారణ అయిందని వైద్యులు చెబుతున్నారు. కడుపులోని గాలి బుడగలను ఆ మహిళ గర్భంగా భావించిందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన అలిపిరి పోలీసులు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories