సంచలనం సృష్టిస్తున్న దీప్తిశ్రీ అదృశ్యం

సంచలనం సృష్టిస్తున్న దీప్తిశ్రీ అదృశ్యం
x
సంచలనం సృష్టిస్తున్న దీప్తిశ్రీ అదృశ్యం
Highlights

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ అదృశ్యం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు...

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ అదృశ్యం సంచలనం సృష్టించింది. దీప్తిశ్రీని హత్యచేసి ఇంద్రపాలెం వద్ద ఉప్పుటేరులో పడవేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. అమె సవతి తల్లి శాంతకుమారి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని దీప్తిశ్రీ బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో కీలక సమాచారం అందజేసినట్టు తెలుస్తోంది. శాంతకుమారి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంద్రపాలెం లాకుల వద్ద దీప్తిశ్రీ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. చీకటి పడటంతో తాత్కాలికంగా గాలింపు చర్యలు నిలిపివేసింది ధర్మాడి సత్యం బృందం. రేపు ఉదయం మళ్లీ గాలింపు చర్యలను ప్రారంభించనున్నారు.

అయితే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నేతాజీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భోజనం చేసిన దీప్తిశ్రీ.. స్నేహితులతో ఆడుకుంటుంది. 12 గంటల 15 నిమిషాలకు ఇంటి నుండి బయల్దేరిన సవతి తల్లి శాంతి కుమారి 12 గంటల 45 నిమిషాలకు దీప్తిశ్రీ చదువుకుంటున్న స్కూల్‌కు చేరుకుంది. 12 గంటల 50 నిమిషాలకు నేతాజీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుండి మునసబు జంక్షన్‌ వరకు దీప్తీశ్రీని నడిపించుకుంటూ తీసుకెళ్లింది. పది నిమిషాలకు ఓ ఆటో మారుతూ.. మధ్యాహ్నం ఒంటి గంట 45 నిమిషాలకు దీప్తీశ్రీ మెడకు టవల్‌ చుట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం ఆటోలు మారుతూ... చివరికి ఇంద్రపాలెం బ్రిడ్జికి చేరుకుంది. మధ్యాహ‌్నం 3 గంటలకు గోనె సంచిలో ఉన్న పాప మృతదేహాన్ని ఉప్పుటేరులో పడేసి యధావిధిగా ఇంటికి వెళ్లిపోయింది శాంతకుమారి. దీప్తిశ్రీ సాయంత్రం నాలుగున్నర అయినా ఇంటికి రాకపోవడంతో మేనత్త... తండ్రి శ్యామ్‌కు ఫోన్‌ చేసింది. ఎంత వెతికినా కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories