Ayodhya Ram Mandir Set: విశాఖలో అయోధ్య రామ మందిరం నమూనా సెట్ వివాదం – నిర్వాహకులు అరెస్ట్

Ayodhya Ram Mandir Set: విశాఖలో అయోధ్య రామ మందిరం నమూనా సెట్ వివాదం – నిర్వాహకులు అరెస్ట్
x

Ayodhya Ram Mandir Set: విశాఖలో అయోధ్య రామ మందిరం నమూనా సెట్ వివాదం – నిర్వాహకులు అరెస్ట్

Highlights

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామ మందిరం నమూనా వివాదాస్పదంగా మారింది. 45 రోజులుగా ప్రజల సందర్శనతో కిటకిటలాడిన ఈ నమూనా ఆలయం వద్ద సీతారాముల కళ్యాణం పేరుతో విస్తృత ప్రచారం జరిపారు.

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన గరుడ అయోధ్య రామ మందిరం నమూనా వివాదాస్పదంగా మారింది. 45 రోజులుగా ప్రజల సందర్శనతో కిటకిటలాడిన ఈ నమూనా ఆలయం వద్ద సీతారాముల కళ్యాణం పేరుతో విస్తృత ప్రచారం జరిపారు. ₹2999 చెల్లించిన భక్తులకు భద్రాచలం ఆస్థాన వేద పండితుల సమక్షంలో కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని పోస్టర్లు, బ్రోచర్ల ద్వారా ప్రకటనలు చేశారు.

ఈ విషయం భద్రాచలం దేవస్థానం అధికారుల దృష్టికి చేరింది. తమ అనుమతి లేకుండా ఇలా కార్యక్రమం నిర్వహించడం ఎలా సాధ్యమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశాఖ జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా నిర్వాహకులపై 318 (4) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. భక్తులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇక, భద్రాచలం రాముడి కళ్యాణం పేరుతో భక్తులను మోసం చేస్తున్నారని హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ నమూనా ఆలయాన్ని వెంటనే తొలగించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రేపు హిందూ సంఘాలు ఆధ్వర్యంలో ఆందోళనలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర సాధువులు కూడా ఇందులో పాల్గొననున్నట్లు సమాచారం, దీంతో వ్యవహారం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories