Viveka Murder Case: విచారణకు రాలేనన్న అవినాష్‌రెడ్డి

Avinash Reddy Did not appear in the CBI investigation
x

Viveka Murder Case: విచారణకు రాలేనన్న అవినాష్‌రెడ్డి

Highlights

Viveka Murder Case: ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసు

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల సమయం కోరుతూ సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డికి లేఖ రాశారు.

ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని కోరారు. షార్ట్ నోటీసు ఇచ్చినందున విచారణకు మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి విజ్ఞప్తిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. సిబిఐ ఎదుట అవినాష్ రెడ్డి సోషల్ మీడియా ప్రతినిధులు, వివేకానంద కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ ను విచారించింది సిబిఐ.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారించారు. దాదాపు 20 రోజుల విరామం తర్వాత అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ ఆఫీస్ లో తమ ముందు విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులకు లేఖ రాసిన అవినాష్ రెడ్డి.. తన సొంత జిల్లాలో పార్టీ పరమైన కార్యకలాపాలు ముందుగా నిర్ణయించుకున్నందున నాలుగు రోజుల తర్వాత విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరారు.

అవినాష్ తనకు నాలుగు రోజుల సమయం కోరుతూ సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డికి లేఖ రాశారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని కోరారు. షార్ట్ నోటీసు ఇచ్చినందున విచారణకు మరింత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు.

అవినాష్ రెడ్డి విజ్ఞప్తిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.

వివేకా కుమార్తె వైఎస్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. వివేకా రాసిన లేఖపై వీరిద్దరిని సీబీఐ అధికారులు ప్రస్నించారు. ఇప్పటికే ఇదే అంశంపై పలుమార్లు సీబీఐ ఎదుట హాజరైన వీరిద్దరూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతకుముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు సీబీఐ ఎదుట హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజును ఘటనాస్థలంలో ఉదయ్ కుమార్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్రా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలోనే వీరిని విచారణకు పిలిచింది.

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు సీబీఐ ఎదుట హాజరయ్యారు. వివేకా హత్య జరిగిన రోజును ఘటనాస్థలంలో ఉదయ్ కుమార్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, రవీంద్రా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలోనే వీరిని విచారణకు పిలిచింది. వాళ్ల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిబిఐ.

Show Full Article
Print Article
Next Story
More Stories