అవంతి శ్రీనివాస్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పిన జగన్

అవంతి శ్రీనివాస్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పిన జగన్
x
Highlights

ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కు జగన్ కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఆయనను భీమిలి నియోజకవర్గానికి ఇంచార్జ్ గా...

ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కు జగన్ కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఆయనను భీమిలి నియోజకవర్గానికి ఇంచార్జ్ గా నియమించారు. అవంతికి భీమిలీ అసెంబ్లీ పగ్గాలను అప్పగిస్తున్నట్లు వైసీపీ అధిష్టానం నుంచి ఓ ప్రకటన వెలువడింది. దీంతో అవంతి అనుచరులు, కార్యకర్తలు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. మొన్నటి వరకు టీడీపీ తరుపున అనకాపల్లి ఎంపీగా ఉన్న ఆయన.. భీమిలీ టికెట్‌ ఆశించి వైసీపీలో చేరారు.. అపార్టీలో చేరినప్పుడే జగన్‌ నుంచి అవంతికి హామీ వచ్చినట్టు సమాచారం. దీంతో బుధవారం నుంచి ఆయన నియోజకవర్గంలో పర్యటన ప్రారంభిస్తారని సమాచారం.


Show Full Article
Print Article
Next Story
More Stories