14న జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి

14న జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
x
జిల్లా న్యాయమూర్తి మహాలక్ష్మి, పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు
Highlights

కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదికని, కక్షిదారులకు డబ్బు సమయం కూడా ఆదా అవుతుందని పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి మహాలక్ష్మి పేర్కొన్నారు.

గుడివాడ: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదికని, కక్షిదారులకు డబ్బు సమయం కూడా ఆదా అవుతుందని పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి మహాలక్ష్మి పేర్కొన్నారు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కోర్టు భవన సముదాయాల తో డిసెంబర్ 14వ తేదీన నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ ఈ సందర్భంగా పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు న్యాయమూర్తి మహాలక్ష్మి మాట్లాడుతూ లోక్ అదాలత్ కేసుల పరిష్కారం అయిన కేసులు తిరిగి మరో కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం లేదన్నారు.లోక్ అదాలత్ ద్వారా కేసులు సత్వర పరిష్కారం అవుతాయనే విషయాన్ని ప్రజలు తెలియజేసేందుకు న్యాయవాదులు లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు మరింత కృషి చేయాలని సూచించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories