అనంతపురం జిల్లాలో దారుణం..రూం అద్దెకు ఇవ్వలేదని లాడ్జి మేనేజర్ పై దాడి

X
Highlights
* తీవ్ర గాయాలతో లాడ్జి మేనేజర్ ఈశ్వరయ్య మృతి * ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరొకరు పరార్ * బత్తలపల్లి మండలం కేంద్రంలో ఘటన
admin23 Nov 2020 4:22 AM GMT
అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూం అద్దెకు ఇవ్వలేదని లాడ్జి మేనేజర్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. దుండగులు చేసిన దాడిలో ఉమ లాడ్జి మేనేజర్ ఈశ్వరయ్య తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాల పాలైన లాడ్జి మేనేజర్ ఈశ్వరయ్యను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పారిపోయినట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు ధర్మవరానికి చెందిన వారు కాగా.. ఒకరు బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
Web TitleAttack on lodge manager in Anathapuram District
Next Story