చాలాకాలం తర్వాత ఒకే కార్యక్రమానికి జగన్, చంద్రబాబు

At Home Programme at Raj Bhavan Vijayawada
x

చాలాకాలం తర్వాత ఒకే కార్యక్రమానికి జగన్, చంద్రబాబు

Highlights

At Home Programme: జగన్, చంద్రబాబు ఏం మాట్లాడుకుంటారనే దానిపై చర్చ

At Home Programme: చాలాకాలం తర్వాత ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఒకే వేదికపైకి వచ్చారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ఇద్దరు నాయకులు హాజరయ్యారు. దీంతో ఈ ఇద్దరు నాయకులు ఎదురుపడితే.. షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా..? ఇద్దరి మధ్య మాట ముచ్చట జరుగుతుందా..? లేక పలకరింపులు లేకుండానే పనికానిచ్చేస్తారా..? అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇదే అంశంపై నిన్న సాయంత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగింది. అయితే అందరూ అనుకున్నట్లు ఇద్దరి మధ్యా ఎలాంటి చర్చ కాదు కదా.. చూపులు కూడా కలిసినట్లు కనిపించలేదు.

గవర్నర్‌ దంపతులతో సీఎం జగన్ దంపతులు, హైకోర్టు సీజే జస్టిస్ పీకే మిశ్రా దంపతులు ప్రధాన టేబుల్‌ దగ్గర ఆసీనులు కాగా.. ఆ పక్కనే చంద్రబాబు అచ్చెన్నాయుడు, కేశినేని తదితరులు కూర్చున్నారు. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి పలకరింపులు కనిపించలేదు. ఎడమొహం, పెడమొహం అన్నట్లుగా ఇద్దరి వైఖరి కనిపించింది. అయితే ఆ మధ్య అసెంబ్లీలో తన సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆవేదనతో.. చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ సీఎం అయిన తరువాతే.. అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేసారు. అప్పటి నుంచి సీఎం జగన్, చంద్రబాబు ఒకే వేదిక మీదకు వచ్చిన దాఖలాలు లేవు. అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు వెళ్లకపోయే సరికి ఇద్దరూ ఒకేచోటుకు వచ్చే సందర్భం ఏదీ లేకుండా పోయింది.

అయితే ఇటీవలే.. ఢిల్లీలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ కార్యక్రమానికి.. చంద్రబాబు హాజరయ్యారు. అయితే ఆ తర్వాతి రోజు జరిగిన నీతి ఆయోగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి సీఎం జగన్ వచ్చారు. ఆ సమయంలో ఇద్దరు ఒకే వేదికపై రాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎట్ హోం కార్యక్రమానికి వచ్చిన ఈ ఇద్దరు నాయకులు ఎదురుపడతారా..? మాట్లాడుకుంటారా..? అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ.. ఎలాంటి పలకరింపులు లేకుండానే.. అధికారిక కార్యక్రమాన్ని ముగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories