నెల్లూరుజిల్లాలో తుఫాన్ ప్రభావం అధికం

Nellore: ఇందుకూరుపేట మండలంలో గ్రామాలకు విద్యుత్ అంతరాయం

Rama Rao
Published on: 11 May 2022 10:41 AM IST
Asani Cyclone Impact is High in Nellore District
X

అసని ప్రభావంతో తీరప్రాంతాల్లో భారీ వర్షాలు

Nellore: అసని తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అసని ప్రభావం తీవ్రంగా ఉంది. ఇందుకూరుపేట మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్‌ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావం రొయ్యల సాగుపై ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో రొయ్య రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యుత్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇప్పటి వరకు విద్యుత్, రెవెన్యూ అధికారులు పత్తాలేకుండా పోయారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story