విజయవాడలో ఉద్రిక్తత .. చంద్రబాబు, లోకేష్ అరెస్ట్

విజయవాడలో ఉద్రిక్తత .. చంద్రబాబు, లోకేష్ అరెస్ట్
x
Highlights

విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్ తో సహా పలువురి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.వేదిక కల్యాణ మండపం ప్రారంభోత్సవం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జేఏసీ నేతలు పాదయాత్రగా బయల్దేరగా బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబుతో సహా పలువురు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్టాడిన చంద్రబాబు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే పోలీసులు ఏమీ చేయలేరని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, ఏ చట్ట ప్రకారం తమను అడ్డుకుంటున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

సీపీఐ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. అరెస్టులతో తమను ఆపలేరన్నారు. చంద్రబాబుతో సహా పలువురు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని వారితో చర్చలు జరుపతున్నారు. అయితే పోలీసులు మాత్రం బస్సు యాత్రకు అనుమతించేది లేదని తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. సీఎం జగన్, పోలీసులకు వ్యతిరేంకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించారు. పోలీసు వాహనాల్లో ఎక్కించారు. మరోవైపు డ్రోన్ సహాయంతో పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories