క్వారంటైన్ సెంటర్లలో అన్ని వసతులు కల్పించాలని

క్వారంటైన్ సెంటర్లలో అన్ని వసతులు కల్పించాలని
x
Collector Venkataramana Reddy (File Photo)
Highlights

పశ్చిమగోదావరి: జిల్లాలో నూతనంగా గుర్తించిన 25 కాలేజీలలోని క్వారంటైన్ సెంటర్లలో అన్ని వసతులు కల్పించాలని జాయింట్ కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి నోడల్...

పశ్చిమగోదావరి: జిల్లాలో నూతనంగా గుర్తించిన 25 కాలేజీలలోని క్వారంటైన్ సెంటర్లలో అన్ని వసతులు కల్పించాలని జాయింట్ కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి నోడల్ అధికారులు, రెసిడెన్స్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి మండలస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ...

ప్రతి జిల్లాలో 5000 బెడ్స్ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినందున ఇప్పటికే గుర్తించిన 7 క్వారం టైన్ సెంటర్ల కు అదనంగా మరో 25 కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా కేంద్రాలకు వెంటిలేషన్ పూర్తిగా ఉండాలని, కాంపౌండ్ వాలు వుండి ఒక గేటు మాత్రమే ఉండాలని, ప్రతి రూంకి ఎటాచ్ బాత్రూం ఉండాలని, బాత్ రూంలో పెద్ద బకెట్, చిన్నబకెట్ , మగ్గు, టాయ్ లెట్ కిట్, బట్టల సబ్బు విధిగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories