నేవీ డే కి సన్నాహాలు

నేవీ డే కి సన్నాహాలు
x
Navy Day Arrangements
Highlights

నౌకాదళ దినోత్సవానికి తూర్పు నౌకాదళం సన్నాహాలు ప్రారంభించింది.ఈసారి కూడా విన్యాసాల కోసం నవంబరు 29 నుంచి బీచ్‌లో రిహార్సల్స్‌ నిర్వహించనున్నట్టు తూర్పు నౌకాదళం తెలిపింది.

విశాఖపట్నం: నౌకాదళ దినోత్సవానికి తూర్పు నౌకాదళం సన్నాహాలు ప్రారంభించింది. డిసెంబరు 4న జరిగే నేవీ డే సందర్భంగా నౌకాదళం శక్తి, సామర్థ్యాలు ప్రజలకు ప్రత్యక్షంగా చూపించడానికి వీలుగా సముద్రంలో విన్యాసాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా విన్యాసాల కోసం నవంబరు 29 నుంచి బీచ్‌లో రిహార్సల్స్‌ నిర్వహించనున్నట్టు తూర్పు నౌకాదళం తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే బీచ్‌లో ఏర్పాట్లు చేసింది.

ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రిహార్సళ్లుంటాయి. డిసెంబరు 2న పూర్తిస్థాయి రిహార్సల్‌లో అన్ని విన్యాసాలు ప్రదర్శిస్తామని, ప్రజలు సహకరించాలని ఒక ప్రకటనలో కోరింది. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ప్రదర్శనలో పాల్గొంటాయని, బీచ్‌లో ఉండేవారు పక్షులను ఆకర్షించేలా ఎటువంటి తినుబండారాలు బయట వేయకూడదని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories