Tirupati By poll: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్దం

Representational Image
Tirupati By poll: అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 28 మంది అభ్యర్థులు
Tirupati By poll: కాసేపట్లో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభంకానుంది. తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 17 లక్షల 10 వేల 699. ఇందులో పురుషుల ఓట్లు 8 లక్షల 38 వేల 540... మహిళలు 8 లక్షల 71 వేల 943 మంది ఉన్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోకవర్గాలున్నాయి. నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు వుండగా, చిత్తూరు జిల్లాలో మూడున్నాయి.
2వేల 470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 339 సెంటర్లు, గూడూరు 366, సూళ్లూరుపేట 343, వెంకటగిరు 366, తిరుపతి 382, శ్రీకాళహస్తి 362, సత్యవేడు 312 కేంద్రాలు. 877 పోలింగ్ సెంటర్లను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
కరోనా ఉధృతి నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎన్నికల అధికారులు చెప్పారు. ఎక్కువమంది ఓటర్లున్న కేంద్రాలను రెండుగా విభజించామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గరా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ కోసం ప్రత్యేక సిబ్బంది వుంటారని వెల్లడించారు. కరోనా నేపథ్యంలో వైరస్ సోకిన వారికి తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ పంపిణీ చేశామన్నారు.
ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు మొత్తం 28 అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నోటా గుర్తుతో పాటు మొత్తం 29 సింబల్స్‌తో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ పర్యవేక్షించేందుకు 288 మంది సిబ్బందిని నియమించింది ఎన్నికల సంఘం.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
నిధుల సేకరణ కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. రాజధాని భూముల అమ్మకానికి...
25 Jun 2022 4:15 PM GMTటీచర్ల ఆస్తుల వెల్లడి ఆదేశాలపై వెనక్కి తగ్గిన టీ సర్కార్
25 Jun 2022 4:00 PM GMTHealth Tips: చెమట విపరీతంగా పడుతోందా.. అయితే డైట్లో ఈ మార్పులు...
25 Jun 2022 3:30 PM GMTతెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..
25 Jun 2022 3:15 PM GMTVikarabad: 48 గంటల్లో నా భార్య ఆచూకీ కనిపెట్టకపోతే మా శవాలు చూస్తారు!
25 Jun 2022 2:54 PM GMT