కస్తూర్భా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి

కస్తూర్భా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి
x
డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజేష్, వాసుపల్లి రాజ్యలక్ష్మి, తలుపులు రావు, ఝాన్సీ
Highlights

మండలం తిమ్మాపురం గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ డిమాండ్ చేశారు.

ఎస్.రాయవరం: మండలం తిమ్మాపురం గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇక్కడి విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్కూల్ ని సందర్శించిన ఆయన విద్యార్థులకు పడుకోవడానికి సరైన మౌలిక వసతులు లేని కారణంగా గజ్జి, తామర, దురద వంటి అంటు వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు. కావున మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని సూచించారు.

పాఠశాలలో గల విద్యుత్ వైర్లు భయం గొలిపే విధంగా ఉన్నాయని తక్షణమే వాటిని అన్నిటిని రిపేర్ చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులందరికీ అదనపు గదులు కేటాయించి పడుకోవడానికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. విద్యా కమిటీ మరియు పాఠశాల ఎస్ఓ కి తెలియ చేసినప్పటికీ సమస్య పరిష్కారం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజేష్, వాసుపల్లి రాజ్యలక్ష్మి, తలుపులు రావు, ఝాన్సీ, తలుపులమ్మ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories