నారా లోకేశ్ పాదయాత్రలో ఇరువర్గాల వాగ్వాదం

Argument Between the Two Groups During the Nara Lokesh Padayatra
x

నారా లోకేశ్ పాదయాత్రలో ఇరువర్గాల వాగ్వాదం

Highlights

Chittoor: లోకేశ్ పాదయాత్రలో పరస్పరం దాడిచేసుకున్న ‎‎ఇరువర్గాలు

Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా బైరెడ్డిపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశంపార్టీ నాయకులకు సంబంధించిన బ్యానర్లను చించివేశారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో బైరెడ్డిపల్లి మండల టీడీపీ అధ్యక్షులు కిశోర్ గౌడ్ గాయపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు క్రిష్ణమూర్తి ఇంటివద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో శాంతి వాతావరణాన్ని పెంపొందించేందుకు పోలీసు బలగాలు శ్రమించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories