Top
logo

సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ యాదవ్ కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు

సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ యాదవ్ కు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు
Highlights

సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక...

సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో సీనియర్ జర్నలిస్ట్ అయిన అరవింద్ యాదవ్ ను ఢిల్లీలో ఏపీ భవన్ మీడియా వ్యవహారాల ఓఎస్డీగా నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం జీవో విడుదల చేశారు. మీడియా రంగంలో 24 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న అరవింద్ యాదవ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు మీడియా సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. జాతీయ మీడియా సంస్థలు ఆజ్ తక్, ఐబిఎన్ 7లో వివిధ హోదాల్లో పనిచేశారు. తెలుగులో రెండు ప్రముఖ ఛానల్స్, అలాగే యువర్ స్టోరీ మీడియాలలో ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. పలు హిందీ పుస్తకాలను కూడా రచించారు అరవింద యాదవ్.


లైవ్ టీవి


Share it
Top