అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న అరుకు ఎం.పి. గొడ్డేటి మాధవి

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న అరుకు ఎం.పి. గొడ్డేటి మాధవి
x
Highlights

ఏజెన్సీలో రూ.24 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అరకు ఎంపీ గోడ్డేటిమాధవి అన్నారు.

చింతపల్లి: ఏజెన్సీలో రూ.24 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అరకు ఎంపీ గోడ్డేటిమాధవి అన్నారు. మండలంలోని లోతుగెడ్డ జంక్షన్, ఉమ్మరాసగొంది, భీమసింగి గ్రామాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న లంబసింగి ఘాట్ రోడ్డులోని ప్యూపాయింట్ వద్ద రూ.15 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నామన్నారు. అలాగే రూ.6 లక్షల వ్యయంతో చింతపల్లిలో 3, భీమసింగిలో 1 ప్రజా మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు.

మండల కేంద్రంలోని ఆర్.టి.సి కాంప్లెక్స్ వద్ద, సంత బయలు కేంద్రాలలో రూ.3 లక్షల వ్యయంతో ఐమాక్స్ సోలార్ విద్యుత్ దీపాలు నిర్మిస్తామన్నారు. భీమసింగి, మామిడిపల్లి గ్రామాల మధ్య వంతెన నిర్మాణం కొరకు చుట్టుప్రక్కల గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా సంబంధిత అధికారులతో చర్చించి, వంతెన నిర్మాణానికి అంచనా వ్యయాన్ని రూపొందించి, ఎంపి నిధులతో నిర్మాణం చేపడతామని ఆమె హామీ ఇచ్చారు. తన తండ్రి స్వర్గీయ మాజీ ఎంఎల్ఏ గోడ్డేటి దేముడుకు ఈ ప్రాంతం పై మక్కువ ఎక్కువని అదే ఈనాడు తనకు అలవడిందన్నారు.

తమ తమ గ్రామాల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అలాగే చింతపల్లిలో స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం ఆమె భీమసింగిలోని పంతులుబాబు గుడిని సందర్శించి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త శివప్రసాద్, వైయస్సార్ పార్టీ మండల అధ్యక్షుడు మోరి రవి, బోయిన సత్యనారాయణ, సుర్ల భాను శంకర్, సుర్ల లోవరాజు తదితరులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories