ఏపీలో రేపటి నుంచే ఆర్టీసీ సర్వీసులు.. ఛార్జీలు పెంచడం లేదు : ఆర్టీసీ ఎండీ

ఏపీలో రేపటి నుంచే ఆర్టీసీ సర్వీసులు.. ఛార్జీలు పెంచడం లేదు : ఆర్టీసీ ఎండీ
x
Highlights

రేపటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ తెలిపారు. విశాఖ నగరాల్లో సిటీ...

రేపటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ తెలిపారు. విశాఖ నగరాల్లో సిటీ సర్వీసులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు రేపు ఉదయం నుంచి పునరుద్ధరించనున్నట్టు మాదిరెడ్డి ప్రతాప్‌ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు తగ్గినా ఫర్వాలేదు ప్రయాణికుల క్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు. బస్సుల్లో ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

అత్యవసరమైతేనే వృద్ధులు, పదేళ్ల లోపు పిల్లలు బస్సుల్లో ప్రయాణించాలన్నారు. టిక్కెట్ల విషయంలో నగదు రహిత లావాదేవీలకు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌కు రిజర్వేషన్ ఫీజు ఉండదని తేల్చిచెప్పారు. అలాగే ఆర్టీసీలో కొన్నాళ్లపాటు ఆన్ బోర్డ్ కండక్టర్లు ఉండరని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏసీ బస్సులు నడుపుతాం. కానీ దుప్పట్లు ఇవ్వము. ఛార్జీలను పెంచట్లేదు అని మాదిరెడ్డి ప్రతాప్ చెప్పారు. ఇక అంతరాష్ట్ర సర్వీసులను ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories