Andhra Pradesh: ప్రయాణికుల బస్సు టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి APSRTC సమయం పొడిగింపు..

Andhra Pradesh: ప్రయాణికుల బస్సు టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి APSRTC సమయం పొడిగింపు..
x
Highlights

Andhra Pradesh: కోవిడ్ -19 లాక్‌ డౌన్ సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు APSRTC మరోసారి అవకాశం ఇచ్చింది.

Andhra Pradesh: కోవిడ్ -19 లాక్‌ డౌన్ సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు APSRTC మరోసారి అవకాశం ఇచ్చింది. బుక్ చేసిన టికెట్లను రద్దు చేయడానికి, వాపసు పొందటానికి సమయాన్ని పొడిగించింది. లాక్‌ డౌన్ సమయంలో టిక్కెట్లు రద్దు చేసిన ప్రయాణీకులకు డబ్బు తిరిగి చెల్లించబడుతుందని, లాక్‌ డౌన్ సమయంలో ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని ఆర్టీసీ తెలిపింది.

అంతకు ముందు, జూలై 15 నుండి 29 వరకు టిక్కెట్లను రద్దు చేయడానికి, వాపసు పొందడానికి ఇప్పటికే కౌంటర్లను ఏర్పాటు చేశారు. అయితే, కొంతమంది ప్రయాణీకులు వివిధ కారణాల వల్ల టిక్కెట్లను రద్దు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో, టిక్కెట్లను రద్దు చేయడానికి, వాపసు మొత్తాన్ని స్వీకరించడానికి 31-08-2020 నుండి 14-09- 2020 వరకు 15 రోజుల పాటు వారికి మరోసారి అవకాశం ఇచ్చింది. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఓ), కె. ఎస్. బ్రహ్మానంద రెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసి.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రయాణికులకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories