APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ బస్సులు తప్ప అన్నిటికీ రిజర్వేషన్లు ప్రారంభం

APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ బస్సులు తప్ప అన్నిటికీ రిజర్వేషన్లు ప్రారంభం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మళ్లీ ఆన్ లైన్ రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14తో లాక్‌డౌన్‌ ముగియనుంది. అనంతరం ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించేందుకు సిద్దమైంది.

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మళ్లీ ఆన్ లైన్ రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14తో లాక్‌డౌన్‌ ముగియనుంది. అనంతరం ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించేందుకు సిద్దమైంది.ముందు జాగ్రత్తగా బస్సుల విషయంలోనూ తగు మార్గదర్శకాలు పాటిస్తున్నారు. ఏసీ బస్సులను నడపకూడదని నిర్ణయించారు. ప్రస్తుతానికి సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌ బస్సులకు రిజర్వేషన్లు మాత్రమే ప్రారంభించారు.

ఆర్టీసీ బస్సుల్లో కూడా ఏసీ బస్సుల సర్వీసులను గణనీయంగా తగ్గించి నాన్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సులను, ఢీలక్స్, అల్ట్రా డీలక్స్ బడులను అందుబాటులోకి తీసుకొచ్చారు. విజయవాడ బస్టాండ్‌ నుంచి నాన్‌ ఏసీ సర్వీసులను ఆర్టీసీ ప్రారంభించనుంది. కరోనా వైరస్‌ ఏసీలో త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత దశలవారీగా ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించారు.ఈనెల 15వ తేదీన హైదరాబాద్ కు 115 సర్వీసులకు టిక్కెట్‌ బుకింగ్స్‌ అందుబాటులో తీసుకురాగా.. విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాల నుంచి వెళ్లేవి 10 ఏసీ బస్సులే ఉన్నాయి. మిగిలిన 105 సర్వీసులు సూపర్‌ లగ్జరీ బస్సులు మాత్రమే. బెజవాడ నుంచి తిరుపతికి 45 సర్వీసులు ఉన్నాయి. వీటిల్లో కేవలం 5 మాత్రమే ఏసీ సర్వీసులు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories