ఎపీఎస్ఆర్టీసీ పెట్రోల్ పంపులు..అదనపు ఆదాయం కోసం!

ఎపీఎస్ఆర్టీసీ పెట్రోల్ పంపులు..అదనపు ఆదాయం కోసం!
x
Highlights

ఏ సమస్యలు వచ్చినా ముందుగా నష్టపోయేది ఆర్టీసీయే. సమైక్యాంద్ర ఉద్యమం, బందులు, కరోనా ఇలా ఏ సమస్య వచ్చినా వీటి ప్రభావం ఆర్టీసీపై పడుతూనే ఉంటుంది. ఇలాంటి సమయాల్లో రేట్లు పెంచడం లేదా ఇతర వనరులను విస్తరించుకోవడం చేస్తుంటారు.

ఏ సమస్యలు వచ్చినా ముందుగా నష్టపోయేది ఆర్టీసీయే. సమైక్యాంద్ర ఉద్యమం, బందులు, కరోనా ఇలా ఏ సమస్య వచ్చినా వీటి ప్రభావం ఆర్టీసీపై పడుతూనే ఉంటుంది. ఇలాంటి సమయాల్లో రేట్లు పెంచడం లేదా ఇతర వనరులను విస్తరించుకోవడం చేస్తుంటారు. గతంలో ఇదే మాదిరి వ్యవహారంలో ఆర్టీసీకి చెందిన స్థలాలను లీజు పేరుతో అభివృద్ధి కి వచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే కరోనా సమయంలో తీవ్రంగా నష్టపోవడం వల్ల దాన్ని పూడ్చుకోడానికి ఇతర వ్యవహరాలను నిర్వహించేందుకు పరిశీలన చేస్తోంది. దీనిలో ప్రధానంగా పెట్రోల్ బంకులను నిర్వహించడం కోసం, అయితే వీటిని స్వంతంగా నిర్వహించడమా... లేక గతంలో మాదిరి లీజుకు ఇవ్వడమా అనే దానిపై ఆలోచన చేస్తోంది.

కరోనా వైరస్ కారణంగా కుదేలైన ఆర్టీసీని మళ్లీ లాభాల బాటలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రణాళికలను సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే బస్టాండులు, బస్ డిపోల ప్రాంగణాల్లో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. దీనితో ఏపీఎస్ఆర్టీసీ మొదటిగా జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో ప్రధానంగా ఉన్న 90 బస్ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

అయితే వీటిని ఆర్టీసీ సొంతంగా నడిపించాలా లేదంటే పెట్రోలియం సంస్థలకు లీజుకు ఇవ్వాలా అనే దానిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిపాదనపై సాధ్యాసాధ్యాలను అధికారులు పెట్రోలియం సంస్థల ప్రతినిధులతో గత మూడు రోజులుగా చర్చలు జరుపుతున్నారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం వచ్చే అవకాశముంది.

కాగా, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ బస్టాండుల సమీపంలో పెట్రోల్ బంకులు లేవన్న సంగతి తెలిసిందే. దీని బట్టి ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం బస్టాండ్లలో బంకులు ఏర్పాటు అయితే కాంట్రాక్టు పద్దతిలో నడుపుతున్న బస్సులు కూడా ఇక్కడే ఇంధనం నింపుకునే అవకాశం ఉంటుంది. దీనితో ఆర్టీసీకి అదనపు ఆదాయం కూడా వస్తుంది

Show Full Article
Print Article
More On
Next Story
More Stories