APSRTC : దసరా పండుగ కోసం దూర ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు

APSRTC : దసరా పండుగ కోసం దూర ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు
x

APSRTC buses (file image)

Highlights

కరోనా కారణంగా పూర్తిగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ఇప్పుడిప్పుడే రోడ్లెక్కాయి. క్రమంగా ప్రజాజీవితమూ కుదుట పడుతూ వస్తోంది. ఇక త్వరలో దసరా పండుగ...

కరోనా కారణంగా పూర్తిగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు ఇప్పుడిప్పుడే రోడ్లెక్కాయి. క్రమంగా ప్రజాజీవితమూ కుదుట పడుతూ వస్తోంది. ఇక త్వరలో దసరా పండుగ రానుంది. పండుగకు ఊళ్లకు వెళ్ళే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యెక బస్సులు నడపడానికి ప్రణాలికలు సిద్ధం చేసింది. కరోనా ఎఫెక్ట్ తొలగిన తరువాత వస్తున్న మొదటి పండుగ సీజన్ కావడంతో ప్రజలు అటూ ఇటూ తిరిగే అవకాశం ఉందని భావిస్తోంది ఆర్టీసీ. అందుకే ఈ సీజన్ లో ప్రయాణీకులకు అందుబాటులో బస్సు సర్వీసులను ఏర్పాటు చేసి కరోనా నష్టాల నుంచి కొంత ఉపశమనం పొందాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

అందుకోసం.. ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దూరప్రాంతాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు నడిచినట్లే దూర ప్రాంతాలకు 2,028 బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దసరా ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కూడా కల్పించారు.

డిమాండ్‌ మేరకు రిజర్వేషన్‌ చేసుకునే బస్సుల సంఖ్య కూడా పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు రీజనల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులపై చర్చలు ఇంకా పూర్తిగా సఫలం కాకపోవడంతో తెలంగాణకు బస్సులు నడపడం లేదు. ఇరు రాష్ట్రాల చర్చలు కొలిక్కి వచ్చాకే తెలంగాణకు ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించాలని ఏపీఎస్‌ ఆర్టీసీ భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories