ఏపీలో బస్సుపాసుల జారీకి ఎపీఎస్ఆర్టీసీ నిర్ణయం!

ఏపీలో బస్సుపాసుల జారీకి ఎపీఎస్ఆర్టీసీ నిర్ణయం!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో బస్సుపాసుల జారీ కోసం ఏపీఎస్ ఆర్టీసీఏర్పాట్లు చేస్తోంది.

కరోనా వైరస్ తో సాధారాణ జీవన పరిస్థితులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. కేంద్రం లాక్ డౌన్ విధించడం.. కరోనా వ్యాధి విపరీతంగా పెరిగిపోతుండడంతొ రవాణా వ్యవస్థలు అనీ పూర్తిగా స్తంభించిపోయాయి. క్రమేపీ పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. దీంతో ఆగిపోయిన అన్ని వ్యవస్థలు మెల్లగా తిరిగి ప్రారంభం అవుతూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఏపీఎస్ఆర్టీసీ సేవలు రాష్ట్రంలో మే 21 నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అన్ని జిల్లాల్లో రోజూ 3 వేలకు పైగా సర్వీసులను నడుపుతున్నారు. విజయవాడ, విశాఖపట్నంలో సిటీ బస్సు సెప్టెంబరు 20 నుంచి ప్రారంభించారు.

ఇదిలాఉంటె, ఆంధ్రప్రదేశ్ లో ప్రజా రవాణా శాఖ (పీటీడీ) సోమవారం నుంచి ఈ సర్వీసులకు బస్‌పాస్‌లు జారీచేయాలని నిర్ణయించింది. మొదటి దశలో భాగంగా విశాఖపట్నం నగరంలోని మద్దిలపాలెం, ద్వారకా కాంప్లెక్సు, స్టీల్‌ సిటీ కాంప్లెక్సులలో పాస్‌లు ఇవ్వనున్నట్టు రీజనల్‌ మేనేజర్‌ ఎంవై దానం వెల్లడించారు. మరో వారం తరువాత మిగిలిన అన్ని కేంద్రాలలోనూ బస్సు పాసులను జారీ చేస్తారని అయన చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రీజినల్ మేనేజర్ కోరారు.

కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా సిటీ బస్సులను తిప్పుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్ ధరించిన వారికె బస్సు ఎక్కేందుకు అనుమతి ఇస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా అన్ని బస్ స్టేషన్లలోనూ ప్రత్యెక చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ దాదాపుగా బస్సులను పునరుద్ధరించారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర సర్వీసులనూ ఏపీఎస్ఆర్టీసీ పునఃప్రారంభించింది. అయితే, తెలంగాణాకు మాత్రం ఇంకా సర్వీసులను ప్రారంభించలేదు. అంతర్ రాష్ట్ర సర్వీసుల ఒప్పందం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండడం ఇందుకు అడ్డంకిగా మారింది. ఇప్పటికే తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య పలు చర్చలు జరిగాయి. అయినా ఈ సమస్య ఇప్పటికీ కొలిక్కి రాలేదు.

ఇరురాష్ట్రాల మధ్య మరో దఫా చర్చలకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రోజుకు 1.60 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతామని.. ఏపీఎస్‌ఆర్టీసీ కూడా అన్ని కిలోమీటర్లకే పరిమితం కావాలని తెలంగాణ అధికారులు సూచిస్తున్నారు. కానీ అందుకు ఏపీ అధికారులు అంగీకరించ లేదు. ఈ నేపథ్యంలో అధికారుల స్థాయిలో మరోదఫా చర్చలు నిర్వహించాలని గత సమావేశంలో నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories