ఏపీలో రోడ్డెక్కిన బస్సులు.. షరుతులు ఇవే!

ఏపీలో రోడ్డెక్కిన బస్సులు.. షరుతులు ఇవే!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో బస్సులు రోడ్డెక్కాయి.. ఈ రోజు (గురువారం) ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి.. నిన్న రాత్రి నుంచి ఆన్‌లైన్‌ టిక్కెట్‌ బుకింగ్స్ మొదలు పెట్టారు అధికారులు.

ఆంధ్రప్రదేశ్ లో బస్సులు రోడ్డెక్కాయి.. ఈ రోజు (గురువారం) ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి.. నిన్న రాత్రి నుంచి ఆన్‌లైన్‌ టిక్కెట్‌ బుకింగ్స్ మొదలు పెట్టారు అధికారులు. అయితే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని అంటుంది ఏపీఆర్టీసీ.. ఇంతకి ఆ నిబంధనలు ఏంటో ఒక్కసారి చూద్దాం..

కేవలం రాష్ట్ర పరిధిలోనే బస్సులు నడవనున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 436 మార్గాల్లో 1,683 బస్సులు నడపనున్నారు. అయితే పరిమిత సీట్లలోనే ప్రయాణికులను అనుమతిస్తారు. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సులని నడపనుంది ఏపీఆర్టీసీ.. అయితే అంతకుముందు లాగా బస్సులో కండక్టర్లు ఉండరు. అన్ని బస్సులకూ ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారు. అంతేకాకుండా అన్ని బస్టాండ్లలోనూ కరెంట్‌ బుకింగ్‌ ఉంటుంది. ఇక రాత్రి సర్వీసుల్లో వెళ్లాలనుకునేవారు సాయంత్రం 7 గంటల్లోపే బస్టాండ్లకు చేరుకోవాలి. సాయంత్రం 7 గంటల తర్వాత కర్ఫ్యూ అమలు అవుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక చిన్నపిల్లలు, 65 సంవత్సరాలు దాటినా వారు అవసరం అయితే తప్ప ప్రయాణం చేయరాదు. ఇక ప్రతి బస్టాండ్‌లో శానిటైజర్‌ సదుపాయాన్ని కల్పించారు.. బస్సు ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడు శానిటైజర్‌తో కచ్చితంగా చేతులు శుభ్రంగా చేసుకోవాల్సిందే.. బస్సులో కచ్చితంగా బౌతిక దూరం పాటించాల్సిందే.. అంతేకాకుండా ప్రయాణికులు తమ మొబైల్ లో ఆరోగ్య సేతు యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇక చార్జీలు పెంచలేదని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ పండిట్ నెహ్రు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

లాక్‌డౌన్‌ పూర్తయ్యాక విశాఖ, విజయవాడల్లో సిటీబస్సులు నడపడంపై ఆర్టీసీ నిర్ణయం తీసుకోనుంది ఏసీ బస్సులు కూడా అవసరమైతేనే నడుపుతామని ఏపీఎస్ ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories