APPSC Group 2 Exams: ఏపీలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా... ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

APPSC Group 2 Exams: ఏపీలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా... ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
x
Highlights

APPSC Group 2 Exams: ఏపీలో రేపు ఫిబ్రవరి 23న జరగనున్న గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా ఆదేశిస్తూ ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది....

APPSC Group 2 Exams: ఏపీలో రేపు ఫిబ్రవరి 23న జరగనున్న గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా ఆదేశిస్తూ ఏపీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ లో తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహించడం ఏంటని కొంతమంది అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేయడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వారి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటూ ఏపీపీఎస్సీకి ఈ లేఖ రాసింది.

ప్రస్తుతం అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తంచేస్తోన్న రోస్టర్ సమస్య కోర్టు విచారణలో ఉంది. వచ్చే నెల 11న ఈ పిటిషన్ కోర్టులో విచారణకు రానుంది. దీంతో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఇంకా సమయం ఉన్నందున ప్రస్తుతానికి ఇంకొన్ని రోజుల పాటు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల కంటే ముందుగానే ఇదే విషయమై గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఏపీపీఎస్సీ స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని, అవి కేవలం వదంతులు మాత్రమేనని స్పష్టంచేసింది. కానీ ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖతో ఏపీపీఎస్సీ కూడా పరీక్షలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories