ఎట్టకేలకు గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఖరారు

ఎట్టకేలకు గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఖరారు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి 19 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌...

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్‌1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి 19 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి పీ. సీతారామాంజనేయులు గురువారం రివైజ్డ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. వీటితో పాటు గెజిటెడ్‌ పోస్టులకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. వాస్తవానికి గతేడాది డిసెంబరులోనే గ్రూప్-1 పరీక్షలు జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో.. ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా..

గ్రూప్-1 శిక్షణకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ జనవరి 11న శిక్షణ ప్రారంభించింది. ఈ కారణంగా పరీక్షకు తక్కువ సమయం ఉండటంతో.. మరోసారి పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు.. దాంతో మరోసారి వాయిదా పడ్డాయి. వాయిదాపడిన పరీక్షల తేదీలను జనవరి 27న ప్రకటించనున్నట్లు కార్యదర్శి సీతారామాంజనేయులు ప్రకటనలో తెలిపారు. అయితే ప్రకటించిన డేట్ కంటే మూడు రోజుల ముందుగానే పరీక్షల తేదీలను ప్రకటించడం విశేషం. వారం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరోసారి భేటీ అయ్యి తుది తేదీలను ప్రకటించింది.

రివజ్డ్‌ షెడ్యూల్‌ ఇలా...

ఏప్రిల్‌ 7 : తెలుగుపేపర్‌ (క్వాలిఫయింగ్‌ నేచర్‌)

ఏప్రిల్‌ 8 : ఇంగ్లిష్‌ పేపర్‌ (క్వాలిఫయింగ్‌ నేచర్‌)

ఏప్రిల్‌ 11 : పేపర్‌1

ఏప్రిల్‌ 13 : పేపర్‌2

ఏప్రిల్‌ 15 : పేపర్‌3

ఏప్రిల్‌ 17 : పేపర్‌4

ఏప్రిల్‌ 19 : పేపర్‌5

గెజిటెడ్‌ పోస్టులకు

మే 10, 11 : అసిస్టెంట్‌ బీసీ, సోషల్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌

మే 11 : మైనింగ్‌ రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌

మే 12 : సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఆటోమొబైల్‌ ,ఇంజనీరింగ్‌ పీటీవో, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్, అసిస్టెంట్‌ కెమిస్ట్‌ ఏపీ గ్రౌండ్‌ వాటర్, టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌

Show Full Article
Print Article
More On
Next Story
More Stories