పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
x
jagan ( file photo)
Highlights

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్ చర్చ నడిచింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు... సీఎం జగన్మోహన్ రెడ్డి పరుష పదజాలతో ఘాటు వ్యాఖ్యలు చేసుకున్నారు. దాంతో, ఏపీ అసెంబ్లీ అట్టుడుకిపోయింది.

పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతూ తీసుకొచ్చిన బిల్లుపై వాడివేడి చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు.... సీఎం జగన్మోహన్‌‌‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. టీడీపీ హయాంలోనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని చూస్తే ...ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ వ్యతిరేకించారని బాబు వ్యాఖ్యానించడంతో సీఎం జగన్‌ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాను ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించినట్లు ఒక్క ‎ఆధారం చూపించాలంటూ చంద్రబాబును నిలదీశారు. దాంతో, బాబు-జగన్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది.

అధికార, ప్రతిపక్షాల వాగ్యుద్ధం తర్వాత చివరిగా మాట్లాడిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎంతో ఉన్నత ఆశయంతోనే ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఛాలెంజస్ ఉంటాయని తమకు తెలుసని, కానీ ఎక్కడో ఒకచోట ప్రారంభం ఉండాలనే ధైర్యంగా ముందడుగు వేస్తున్నట్లు ప్రకటించారు. ఉన్నత విద్యావంతుడైన వ్యక్తి... విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని, ఇంగ్లీష్ మీడియాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories