రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు అనుమతి

ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపింది.

Siramdasu Nagarjuna
Published on: 11 Dec 2025 4:51 PM IST
రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు అనుమతి
X

అమరావతి: ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు ఆమోదం తెలిపింది. దాదాపు 44 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్‌భవన్‌, అసెంబ్లీ దర్బార్‌ హాల్‌ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాజధాని అమరావతిలో గవర్నర్‌ కార్యాలయం, గెస్ట్‌ హౌస్‌లు, స్టాఫ్‌ క్వార్టర్ల నిర్మాణానికి అంగీకారం తెలిపారు. పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రి మండలి అనుమతి ఇచ్చింది.

మంత్రి మండలి కీలక నిర్ణయాలు

1.రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 26 సంస్థలకు ఆమోదం.

2. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం.

3. సీడ్ యాక్సెస్ రహదారిని 16వ హైవేకి అనుసంధాన పనులకు రూ.532 కోట్లకు ఆమోదం.

4. గిరిజన సంక్షేమశాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతికి ఆమోదం.

5. ఆంధ్రప్రదేశ్‌ ప్రిజన్స్‌ అండ్‌ కరెక్షనల్‌ సర్వీసెస్‌ ముసాయిదా బిల్లుకి ఆమోదం.

6. ఎస్‌ఐపీబీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు ఆమోదం.

7. కుప్పంలో పాలేరు నదిపై చెక్‌డ్యామ్‌ల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరు.

Siramdasu Nagarjuna

Siramdasu Nagarjuna

Next Story