తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన ఏపీఎన్జీఓ

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన ఏపీఎన్జీఓ
x
Highlights

గతకొన్ని రోజులుగా తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగులు తమ కోరికల సాధన కోసం సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం మద్దతు...

గతకొన్ని రోజులుగా తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగులు తమ కోరికల సాధన కోసం సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం మద్దతు తెలిపింది. ఈ మేరకు ఏపీఎన్జీఓ అధ్యక్షులు యన్ .చంద్రశేఖర రెడ్డి , ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. అలాగే విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయ వద్ద తెలంగాణా ఆర్టీసి ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఉద్యోగులు , ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణా ఆర్టీసి ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని.. గతంలో తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తరువాత ఆ హామిని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. గత 15 రోజులు నుండి సమ్మె చేస్తున్నప్పటికి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వెళుతుందన్నారు.

ఇది ఏ మాత్రం మంచిది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డి ఎన్నికల హామీని నెరవేరుస్తూ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 48 వేలమంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే.. వారితో చర్చలు జరపకుండా.. ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని ప్రకటించడం ఏంటి అని అన్నారు. దాంతో కొందరు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమని ప్రజాస్వామ్యంలో ఇటువంటి నిరంకుశ ధోరణి సరికాదన్నారు.

తెలుగు రాష్ట్రాలు మొన్నటివరకూ కలిసి ఉండేవని, రెండు రాష్ట్రాల మధ్య విధానపరమైన విభేదాలు ఉన్నప్పటికీ.. కష్టం వచ్చినప్పుడు సంఘీభావం తెలపాల్సిన కనీస భాధ్యత తమపై ఉందన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు మద్దతు ఇచ్చారన్నారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం తన మొండి వైఖరి వీడి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలనీ కోరారు. కాగా ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీఓ స్టేట్ జనరల్ సెక్రటరి బి. శ్రీనివాసరావు, పశ్చిమ కృష్ణా కార్యనిర్వాహక కార్యదర్శి పి. రమేష్ , శివలీల, లలితాంబ , అజయకుమార్ తదితర ఉద్యోగులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories