రాష్ట్రం లో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదు: వెంకట్రామిరెడ్డి

X
ramireddy (file image)
Highlights
* కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ప్రభుత్వాన్ని కోరాం * 64 సంఘాలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయి
Sandeep Eggoju9 Jan 2021 10:22 AM GMT
గత ఐదేళ్ల కాలపరిమితిలో ఎన్నికలను ఎందుకు నిర్వహించలేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. మీ ప్రయోజనాల కోసం తమ బతుకులను బలి పెట్టవద్దన్నారు. కరోనా విధుల్లో ప్రజల కోసం ఎంతో రిస్క్‌తో పని చేశామన్న ఆయన ఎన్నికల కోసం కూడా తమ ప్రాణాలు పణంగా పెట్టలేమన్నారు. కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ధైర్యం తమకు లేదని బలవంతం చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. తమ ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టే ఇలా మాట్లాడాల్సి వస్తోందన్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికైనా పునరాలోచించుకోవాలన్నారు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి.
Web TitleAPNGO Leader Venkatrami Reddy on ap local body elections
Next Story