ఏపీ.. లోక్ సభ బరిలో 344 మంది పోటీ .. అసెంబ్లీ బరిలో ..

ఏపీ.. లోక్ సభ బరిలో 344 మంది పోటీ .. అసెంబ్లీ బరిలో ..
x
Highlights

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఈనెల 11న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది....

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఈనెల 11న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. ఇక అసెంబ్లీ బరిలో 2,395 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా.. లోక్ సభ బరిలో 344 మంది తమ అధృతాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఏపీలో మొత్తం 3 కోట్ల 91 లక్షల 81 వేల 399 మంది ఓటర్లు ఉండగా..వీరిలో పురుషులు కోటి 93 లక్షల 82 వేల 68 మంది ఉన్నారు.

మహిళా ఓటర్లు కోటి 97 లక్షల 95 వేల 423 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్ల ఓట్లు 3, 908 ఉన్నాయి. ఈ సారి కొత్తగా 22 లక్షల 48 వేల ఓట్లు యాడ్ అయ్యాయి. గత ఎన్నికల్లో 78 శాతం పోలింగ్‌ నమోదైందని, ఈసారి 85 శాతంకంటే ఎక్కువగా ఉండేలా ఎన్నికల కమిషన్ ప్లాన్ చేసింది. ఎన్నికల బందోబస్తు కోసం 300 కంపెనీల భద్రత బలగాలను కోరగా.. 197 కంపెనీలే వచ్చాయన్నారు. అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కేంద్ర భద్రత బలగాలను వినియోగిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories