మూడు వారాల్లోనే దోషులకు ఉరిశిక్ష పడేలా కొత్త చట్టం : సీఎం వైఎస్ జగన్

మూడు వారాల్లోనే దోషులకు ఉరిశిక్ష పడేలా కొత్త చట్టం : సీఎం వైఎస్ జగన్
x
జగన్
Highlights

కొత్త చట్టం తో మృగాళ్ల పీచమణస్తామని ఏపీ సీఎం జంగన్మోహన్ రెడ్డి చెప్పారు

ఏపీ అసెంబ్లీలో ఉల్లి లొల్లి జరిగింది. మహిళల భద్రత కోసం విప్లవాత్మక చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం స్వల్పకాలిక చర్చను చేపట్టగా ప్రతిపక్ష టీడీపీ మాత్రం ముందుగా ఉల్లిపై డిస్కషన్ చేయాలంటూ పట్టుబట్టింది. అందుకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దాంతో, టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే మహిళల భద్రతపై చర్చను ప్రభుత్వం కొనసాగించింది.

మహిళల భద్రతపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. అయితే, హోంమంత్రి సుచరిత స్టేట్‌మెంట్‌ ఇస్తుండగా, టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ముందుగా ఉల్లిపై చర్చ జరపాలంటూ నినాదాలు చేశారు. దాంతో, సభా వ్యవహారాల మంత్రి బుగ్గన తీవ్రస్థాయిలో స్పందించారు. మహిళల భద్రత పట్ల టీడీపీకి చిత్తశుద్ది లేదంటూ నిప్పులు చెరిగారు. అనంతరం మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ కూడా టీడీపీ తీరుపై మండిపడ్డారు. మహిళల భద్రతపై చర్చ జరుగుతుంటే అడ్డుకోవడమేంటని నిలదీశారు.

అయితే, ఎంత నచ్చజెప్పినా తెలుగుదేశం సభ్యులు వినిపించుకోకపోవడంతో స్పీకర్ ఫైరయ్యారు. ముఖ్యమైన మహిళా బిల్లుపై చర్చ జరుగుతుంటే ఇలా అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. మహిళల భద్రతపై చర్చ జరుగుతున్న సమయంలో ఉల్లిపై చర్చించాలంటూ టీడీపీ గందరగోళం సృష్టించడం మంచిది కాదని ప్రతిపక్షానికి అంబటి సూచించారు. అయినప్పటికీ, టీడీపీ సభ్యులు శాంతించకపోవడంతో గందరగోళం మధ్యే మహిళల భద్రతపై చర్చ కొనసాగింది. అనంతరం మాట్లాడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసి తనపై బురద జల్లడానికే టైమ్ కేటాయిస్తున్నారని మండిపడ్డారు.

ఇక, చివరిగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ ఉదంతంపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దిశ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్న జగన్ అలాంటి మృగాళ్లను కాల్చిచంపినా తప్పు లేదన్నారు. చట్టాలు మారాలి వేగంగా శిక్షలు విధించాలని అప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. అందుకే, కేవలం మూడు వారాల్లోనే దోషులకు ఉరిశిక్ష పడేలా కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories