APCC vice president: పీసీసీ ఉపాధ్యక్షుడు ఆదిరాజు ఆకస్మిక మృతి.. కరోనా భయంతో..

X
Highlights
APCC vice president: ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు ఆకస్మికంగా మరణించారు. తనకు...
Arun Chilukuri8 Aug 2020 6:38 AM GMT
APCC vice president: ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు ఆకస్మికంగా మరణించారు. తనకు ఆయాసంగా ఉందని కుటుంబ సభ్యులకు చెబుతూనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కారులో ఆస్పత్రికి తరలించారు. అయితే, మధ్యలోనే ఆయన మరణించారు. అయితే కరోనాతో మృతి చెంది ఉంటారేమో అన్న అనుమానంతో మృతదేహం వద్దకు వెళ్లేందుకు కూడా బంధువులు సాహసించని పరిస్థితి నెలకొంది. ఆదిరాజుకు మంచి నేతగా పార్టీ అధిష్ఠానం వద్ద గుర్తింపు ఉంది. జిల్లాలో పార్టీకి మళ్లీ జీవం పోసే ప్రయత్నం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణకు నమ్మినబంటుగా ఆయన ఉండేవారు. యడ్ల ఆదిరాజు ఆకస్మిక మృతితో జిల్లా రాజకీయ నేతలు, పలు సంఘాలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
Web TitleAPCC vice president adiraju passes away
Next Story