చంద్రబాబు, బోండా ఉమకు మహిళా కమిషన్ సమన్లు

Women Commission: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, ఆ పార్టీ నేత బోండా ఉమకు ఏపీ మహిళా కమిషన్ నుంచి సమన్లు జారీ అయ్యాయి.

Arun Chilukuri
Updated on: 22 April 2022 9:00 PM IST
AP womens Commission Notice to Chandrababu and Bonda Umamaheswara Rao
X

చంద్రబాబు, బోండా ఉమకు మహిళా కమిషన్ సమన్లు

Women Commission: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, ఆ పార్టీ నేత బోండా ఉమకు ఏపీ మహిళా కమిషన్ నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఈ నెల 27న మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బాధిత కుటుంబం సమక్షంలోనే వాసిరెడ్డి పద్మ, చంద్రబాబు నాయుడు వాగ్వాదానికి దిగారు. ఇరు నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. దీంతో మహిళా కమిషన్ సీరియస్ అయింది. అటు ఆందోళనకారుల దాడిలో పాత జీజీహెచ్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story