Top
logo

దసరా పండగ.. బస్సు టికెట్ ధరలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ నంబర్ కు..

దసరా పండగ..  బస్సు టికెట్ ధరలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ నంబర్ కు..
Highlights

దసరా పండగ.. బస్సు టికెట్ ధరలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ నంబర్ కు..

దసరా పండగ దృష్ట్యా ప్రయాణికుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సిద్ధంగా ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికులను ట్రావెల్స్‌ నిర్వాహకులు ఇబ్బందులు పెడతారనే సమాచారంతో.. ట్రావెల్స్‌కు ఆట కట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ రంగంలోకి దిగింది. వారంరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రవాణశాఖ అధికారులు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. టికెట్ల రేటు పెంచినా, నిబంధనలకు మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేశారు.

కాగా కొన్ని ప్రైవేటు బస్సులు పండగ వేళల్లో అధికంగా రేట్లు పెంచి ప్రయాణికుల నుంచి భారీగా వసూలు చేస్తున్నాయి. ఒక్కోచోట రూ. 350 ఉన్న టికెట్ ధర ఏకంగా రూ.1000 కి పెంచేశారు. దాంతో రవాణా శాఖకు భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అటువంటి ట్రావెల్స్ పై భారీ ఎత్తున జరిమానాలు విధించాలని సిద్ధమైంది. ఎక్కడైనా ట్రావెల్స్‌ నిర్వాహకులు టికెట్ల ధర భారీగా వసూలు చేసి.. రెండు వైపులా బస్సుల్ని తిప్పితే.. ఒకసారికి రూ.25 వేల జరిమానా, రెండోసారి పట్టుబడితే మొదటి జరిమానాకు ఐదు రెట్లు అధికంగా జరిమానా విధించేలా రవాణా శాఖ ఆదేశాలు జారీచేసింది. ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వాలంటే వాట్సాప్‌ నంబరు 9542800800కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రయాణికులకు సూచించారు.


Next Story


లైవ్ టీవి