Pension: గుడ్ న్యూస్.. కొత్తగా 71వేల మందికి పింఛన్లు.. నెలకు ఎంత ఇవ్వనున్నారో తెలుసా?


Pension: గుడ్ న్యూస్.. కొత్తగా 71వేల మందికి పింఛన్లు.. నెలకు ఎంత ఇవ్వనున్నారో తెలుసా?
Pension: ఏపీ ప్రభుత్వ పౌర సంక్షేమంపై మరింత ఫోకస్ పెడుతూ ఎన్టీఆర్ భరోసా స్కీం కింద మరొ కొత్త ప్రకటన చేసింది. ఇప్పటి వరకు వ్రుద్ధులు, దివ్యాంగులకు...
Pension: ఏపీ ప్రభుత్వ పౌర సంక్షేమంపై మరింత ఫోకస్ పెడుతూ ఎన్టీఆర్ భరోసా స్కీం కింద మరొ కొత్త ప్రకటన చేసింది. ఇప్పటి వరకు వ్రుద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు అందించేవారు. ఇప్పుడు భర్త మరణించిన మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పౌజ్ కేటగిరీ పింఛన్లు వచ్చే నెల నుంచే అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేటగిరీ కింద రాష్ట్ర వ్యాప్తంగా 71,380 మందికి నెలకు రూ. 4000 చొప్పున పింఛన్లు మంజూరు చేస్తారు.
దీనికి సంబంధించిన అధికారిక ఆదేశాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఇప్పటికే విడుదల చేసింది. జూన్ 12న ఈ కొత్త పింఛన్లను లబ్దిదారులకు అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంతకుముందు గత ఏడాది నవంబర్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు భర్త మరణించిన తర్వాత భార్యకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల పింఛనుదారులు ఇక నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా తక్షణమే ఆర్థిక భరోసా అందుకునే ఛాన్స్ ఉంటుంది.
అర్హత కలిగిన మహిళలు, భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఆటోమెటిగ్గా ఆధార్ కార్డు వంటి అవసరమైన పత్రాలతో గ్రామ లేదా వార్డు సచివాలయాలను సంప్రదించాలి. ఈ ప్రక్రియ నెలాఖరులోకా పూర్తి చేస్తే వచ్చే నెల నుంచే పింఛన్స్ జమ అవుతుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం తగినన్ని నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. కొత్తగా మంజూరైన 71,380 పింఛన్ల వల్ల సర్కార్ పై నెలకు సుమారు రూ. 35కోట్ల అదనపు భారం పడుతుంది.
జూన్ 12న జరగబోయే ఈ పింఛన్ పంపిణీ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఎందుకంటే అదే రోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలనకు ఏడాది పూర్తివుతుంది. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని తల్లికి వందనం అనే మరో స్కీమును కూడా ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఆగస్టు 15 నుంచి రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అదే సమయంలో అన్నదాత సుఖీభవ స్కీము నిధులను కూడా పీఎం కిసాన్ యోజన అమలు సమయంలో అందిస్తామని కడప మహానాడులో ప్రకటించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



