ఏపీలో ఆగని పదో తరగతి పరీక్ష పేపర్ల లీకులు...

AP Tenth Question Paper Leak Continued by Private Schools Management | Live News
x

ఏపీలో ఆగని పదో తరగతి పరీక్ష పేపర్ల లీకులు...

Highlights

AP Tenth Exams 2022: లీకేజీలో సూత్రధారులుగా చైతన్య, నారాయణ స్కూల్స్ సిబ్బంది...

AP Tenth Exams 2022: ఏపీలో టెన్త్‌ ఎగ్జామ్‌ క్వశ్చన్‌ పేపర్ల లీకుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుంది. తెలుగు, హిందీ ఇంగ్లీష్‌.. ఇలా వరుసగా పేపర్లు లీకవడం సంచలనంగా మారింది. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. మొదటి రెండు రోజులు పరీక్ష ప్రారంభమైన కాసేపటికే తెలుగు, హిందీ పేపర్లు బయటికి రాగా.. మూడో రోజు ఇంగ్లీష్‌ పేపర్ వాట్సప్‌ గ్రూప్‌లో రావడం కలకలం రేగింది. ఎగ్జామ్‌ సెంటర్‌లో సీల్డ్‌ కవర్‌ నుంచి క్వశ్చన్‌ పేపర్‌ బయటకు తీసిన వెంటనే సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసి పంపినట్లు వాట్సప్‌ గ్రూప్‌లో వచ్చిన చిత్రాలను బట్టి అర్ధమవుతోంది.

ముఖ్యంగా ఏపీలో క్వశ్చన్ పేపర్‌ పట్టు.., ర్యాంక్‌ కొట్టు అన్న రీతిలో పరీక్షలు జరుగుతున్నాయి. అవును.. తమవే గొప్ప విద్యాసంస్థలు అని చెప్పుకుంటున్న ప్రైవేట్ స్కూల్స్‌ మాఫియా హస్తం లీకుల వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా లీకేజీలో సూత్రధారులుగా చైతన్య. నారాయణ స్కూల్స్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ర్యాంకులు వస్తే అడ్మిషన్లు పెంచుకోవచ్చన్న దోరణిలో ఉన్న చైతన్య, నారాయణ ఆగడాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి.

మొత్తానికి టెన్త్‌ క్లాస్ క్వశ్చన్‌ పేపర్స్ లీకేజీపై దృష్టి సారించింది ఏపీ సర్కార్. అయితే మంత్రి బొత్స మాత్రం లీకేజీ జరగలేదంటున్నారు. కానీ పోలీసులు మాత్రం లీకేజీ జరిగిందంటున్నారు. మరోవైపు ఏం జరుగుతుందో అర్ధం కాక విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. అయితే ఇప్పటివరకు పేపర్ లీకేజీ చేస్తున్నవారిపై అధికారుల సీరియస్ యాక్షన్ తీసుకోలేనట్లు తెలుస్తుంది. మొత్తానికి క్వశ్చన్ పేపర్ వద్దు.. ఆన్సర్ షీట్ ఇస్తే చాలన్న స్థితికి ఏపీ పరీక్షలు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories