SSC Exams : టెన్త్ పరీక్షలు వాయిదా ?

AP tenth class exams Postponed
x
పదో తరగతి పరీక్షలు వాయిదా
Highlights

ఆంధ్రప్రదేశ్‌‌లో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది....

ఆంధ్రప్రదేశ్‌‌లో 10వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది గురించించి చర్చించారు.

కాగా.. పదో తరగతి పరీక్షల అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, పదో తరగతి పరీక్షలు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకే సమయంలో వస్తే ఇబ్బందులు తలేత్తే అవకాశం ఉండడంతో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఎన్నికలు ముగిసే వరకు అవసరమైతే ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను వాయిదా సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలిపినట్లు తెలుస్తోంది.

పదోతరగతి పరీక్షలను తొలుత మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఎన్నికల పార్టీలతో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చర్చలు జరిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించారు. కాగా, రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బ్యాలెట్ పద్థతిలోనే ఎన్నికలు నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 7న ఎన్నికల షెడ్యూల్‌ను రిలీజ్ ఈసీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories