మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్‌

మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్‌
x
Highlights

విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లినవైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీ తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లినవైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలోని తన నివాసంలో రాత్రి 9 గంటల సమయంలో నెల్లిమర్ల పోలీసులు కళాను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో రాముడి విగ్రహాం ధ్వంసం ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఈ నెల 2వ తేదీన చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డిలు వేర్వేరుగా వెళ్లారు.తొలుత విజయసాయిరెడ్డి ఆలయం వద్ద సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లే సమయంలో ఆయన కారుపై దాడి జరిగింది. ఈ ఘటనపై ఈ నెల 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావుల డైరెక్షన్ లోనే తనపై దాడి జరిగిందని విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories