అరుదైన ఘనత సాధించిన ఏపీ స్విమ్మర్‌ తులసీ చైతన్య

అరుదైన ఘనత సాధించిన ఏపీ స్విమ్మర్‌ తులసీ చైతన్య
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగానికి చెందిన స్విమ్మర్ ఎం.తులసీ చైతన్య అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని కాటలీనా చానెల్‌ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్‌గా...

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ విభాగానికి చెందిన స్విమ్మర్ ఎం.తులసీ చైతన్య అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని కాటలీనా చానెల్‌ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్‌గా గుర్తింపు పొందాడు. 35 కిలోమీటర్ల పొడవు ఉన్న కాటలీనా చానెల్‌ను తులసీ చైతన్య కేవలం 12 గంటల 40 నిమిషాల 24 సెకన్లలో ఈదేశాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత పోలీస్‌ స్విమ్మర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు మూడుసార్లు ప్రపంచ పోలీసు క్రీడల్లో పాల్గొని భారత్‌కు 20 పతకాలు సాధించిపెట్టాడు. 2015, 2017 ఆలిండియా పోలీస్‌ అక్వాటిక్స్‌ లో 'బెస్ట్‌ స్విమ్మర్‌' పురస్కారం కూడా అందుకున్నాడు.

తులసీ చైతన్య ప్రస్తుతం విజయవాడలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతను ఈ ఘనత సాధించడానికి ద్రోణాచార్య అవార్డీ ప్రదీప్‌ కుమార్‌ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఈ సందర్బంగా మాట్లాడిన తులసీ చైతన్య.. వచ్చే ఏడాది జిబ్రాల్టర్‌ జలసంధిని ఈదడమే తన లక్ష్యమని, ఇప్పటి నుంచే దాని కోసం శిక్షణ ప్రారంభిస్తానని చెప్పాడు.. ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్, విజయవాడ సీపీ ద్వారక తిరుమలరావు, అడిషనల్‌ డీజీపీ శ్రీధర్‌ రావు, రూ. 2 లక్షల ఆర్ధిక సహాయం చేసిన పాలకొల్లు వ్యాపారవేత్త నరసింహ రాజు, తెలంగాణ ఐఏఎస్ అధికారి రాజీవ్‌ త్రివేదిలకు కృతజ్ఞతలు తెలిపాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories