AP Students Telangana: ఏపీ స్టూడెంట్స్‌.. చలో తెలంగాణ

AP Students Are Coming To Telangana
x

AP Students Telangana: ఏపీ స్టూడెంట్స్‌.. చలో తెలంగాణ

Highlights

* తెలంగాణ ఎంసెట్‌‌కు 70 వేలకు పైగా ఏపీ విద్యార్థులు అప్లై

AP Students Telangana: ఏపీ విద్యార్థులు తెలంగాణ బాట పడుతున్నారు. ఇంటర్ తర్వాత ఉన్నత విద్యకోసం హైదరాబాద్‌కు పెద్దఎత్తున వస్తున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటం, తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలు మెరుగైన విద్యను అందిస్తుండటంతో హైదరాబాద్ వచ్చి చదువుకునేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బెంగళూరు ఆప్షన్ ఉన్నా హైదరాబాద్‌‌తో పోల్చితే లివింగ్ ఆఫ్ కాస్ట్ బెంగళూరులో ఎక్కువ కావడంతో హైదరాబాద్‌కు ఏపీ విద్యార్థులు క్యూ కడుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఎంసెట్‌కు ఏపీ నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ పరీక్షకు ఈ ఏడాది 3.12 లక్షల దరఖాస్తులు రాగా.. ఏపీ నుంచి 70వేలకు పైగా దరఖాస్తులు అందాయి. గత ఏడాది టీఎస్ AP Students Telangana: ఏపీ స్టూడెంట్స్‌.. చలో తెలంగాణఎంసెట్‌కు 53 వేల 931 వేల మంది ఏపీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 70 వేల 172 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగానికి 50 వేల 081 మంది.. అగ్రికల్చర్ విభాగానికి 20 వేల 91 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా లేట్ ఫీజ్‌తో మే 2 వరకూ దరఖాస్తు చేసుకునే వీలున్నందున.. ఏపీ విద్యార్థుల నుంచి వచ్చే అప్లికేషన్ల సంఖ్య మరో 5 వేలదాకా పెరిగే అవకాశముందని ఎంసెట్ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి హైదరాబాద్ హబ్ మారడం.. విద్యావనరులు, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండడం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే.. విద్యా, ఉద్యోగం కోసం వారు హైదరాబాద్ బాట పడుతున్నారు. రాజధాని నగరం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరున్న ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో విద్యను అభ్యసించేందుకు సన్నద్ధమవుతున్నారు. నాన్-లోకల్ కోటాలో అయినా సరే మంచి సంస్థల్లో సీట్లకు గాలం వేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో ఐటీ బూమ్ కారణంగా.. పేరున్న ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కంప్యూటర్ సైన్స్, అనుబంధ ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్ల సంఖ్యను భారీగా పెంచుకున్నాయి. దీంతో ఏపీ విద్యార్థులకు ఆయా విద్యాలయాల్లో సీట్లను దక్కించుకోవడం సులువవుతోంది. అంతేకాకుండా, ప్రమాణాలు పాటిస్తూ యూజీసీ అటానమస్ హోదా పొందిన 50కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు మంచి ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డుతో ఏపీ విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి.

ఓవైపు బీటెక్ చదువుతూనే.. మెరుగైన ఉద్యోగావకాలకు సహాయపడే కోర్సులు కూడా హైదరాబాద్‌‌లోని పలుప్రాంతాల్లో అందుబాటులో ఉండడాన్ని విద్యార్థులు మరింత ప్రయోజనకరంగా చూస్తున్నారు. అమీర్‌పేట్, కూకట్‌పల్లి, అబిడ్స్,దిల్‌సూక్‌నగర్ ప్రాంతాలోని పలు కోచింగ్ సెంటర్లలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ అధునాతన పరిజ్ఞానాలపై శిక్షణ ఇస్తుండడం.. శిక్షణ కోసం బెంగళూరు, ముంబై, ఢిల్లీ నుంచి రిసోర్స్ పర్సన్లను రప్పిస్తుండడంతో వారికి అవసరమైన నాలెడ్జ్ చౌకగా లభించడం మరింతగా ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌లోని పేరున్న ఐటీ కంపెనీలు సైతం నగరం చుట్టుపక్కల ఉన్న కళాశాలల నుంచే ఫ్రెషర్లను ఎంపిక చేసుకొంటుండడంతో ప్లేస్.. మెంట్ అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. అందుకే ఏపీ విద్యార్థులు సైతం హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదివేందుకు మొగ్గుచూపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories