హైకోర్టును ఆశ్రయించిన ఏపీ'ఎస్ఈసీ' నిమ్మగడ్డ రమేష్ కుమార్

హైకోర్టును ఆశ్రయించిన ఏపీఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకుంటూ ఉద్యోగుల పై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ పిటిషన్.. దాఖలు చేశారు. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు. వేధించడానికి కేసు నమోదు చేశారని, ఎన్నికల కమిషన్ విధుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా మరో పిటిషన్ దాఖలు చేయడంతో రెండు పిటిషన్ లను కలిపి సోమవారం విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది..

కాగా సాంబమూర్తి కంప్యూటర్ లోని డేటాను సీఐడీ తీసుకుందని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి సిఐడి తీసుకువెళ్లిన వస్తువులను ప్రభుత్వం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్ లో కోర్టును కోరారు నిమ్మగడ్డ.. సీఐడీ కేసు నమోదు చేసిన వ్యవహారంపై సీబీఐ విచారణ కోరారు. ఇందులో కేంద్ర హోంశా కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ సీఐడీ, అదనపు డీజీ తదితరులను ప్రతివాదులుగా పిటిషన్ లో పేర్కొన్నారు నిమ్మగడ్డ.

Show Full Article
Print Article
Next Story
More Stories