మూడు రాజధానుల బిల్లుపై హడావుడి.. సెలక్ట్‌ కమిటీకి పేర్లు పంపిన పార్టీలు

మూడు రాజధానుల బిల్లుపై హడావుడి.. సెలక్ట్‌ కమిటీకి పేర్లు పంపిన పార్టీలు
x
Highlights

మండలి రద్దుకు ప్రభుత్వం తీర్మానం చేసినా సెలెక్ట్ కమిటీ పేరుతో ప్రతిపక్షాలు హడావిడి చేస్తున్నాయి. మండలి ఛైర్మన్‌కు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ లు సభ్యుల...

మండలి రద్దుకు ప్రభుత్వం తీర్మానం చేసినా సెలెక్ట్ కమిటీ పేరుతో ప్రతిపక్షాలు హడావిడి చేస్తున్నాయి. మండలి ఛైర్మన్‌కు టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ లు సభ్యుల పేర్లను ఇచ్చాయి.

టీడీపీ నుంచి..

మూడు రాజధానుల బిల్లుకు నారా లోకేశ్‌, అశోక్‌బాబు, తిప్పేస్వామి, బీటీ నాయుడు, సంధ్యారాణి. సీఆర్‌డీఏ బిల్లుకు దీపక్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, బీద రవిచంద్ర, గౌనువారి శ్రీనివాసులు, బుద్ధా వెంకన్న పేర్లను టీడీపీ పంపింది.

బీజేపీ నుంచి..

మూడు రాజధానుల బిల్లుకు మాధవ్‌, సీఆర్‌డీఏ బిల్లుకు సోము వీర్రాజు పేర్లను బీజేపీ పంపింది.

పీడీఎఫ్ నుంచి..

మూడు రాజధానులు బిల్లుకు కె.ఎస్‌.లక్ష్మణరావు, సీఆర్‌డీఏ బిల్లుకు ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) పేర్లను ఆ పార్టీ పంపింది.

రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయా పార్టీలకు సంబంధించిన సభ్యుల పేర్లను సూచించాలని పార్టీలకు లేఖలు రాశారు. దానికి అనుగుణంగా మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులకు ఆయా పార్టీలు పేర్లను పంపాయి. వైసీపీ నుంచి ఇంతవరకు ఎలాంటి జాబితా అందలేదని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories