Top
logo

అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దం.. కొత్తగా 34,907 మందికి..

అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దం.. కొత్తగా 34,907 మందికి..
X
Highlights

ఏపీలో అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 61.65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ..

ఏపీలో అక్టోబర్ 1న పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 61.65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1497.88 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్ధిక శాఖా ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈనెల నుంచి కొత్తగా 34,907 మందికి పెన్షన్ మంజూరు చేసింది ప్రభుత్వం. దీంతో కొత్త పెన్షన్‌దారులకు అదనంగా రూ.8.52 కోట్లు విడుదల చేసింది. పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల చేతికే 2.52 మంది వాలంటీర్లు అందించనున్నారు.

ఇక ఈ నెల నుంచి సైనిక సంక్షేమ పెన్షన్లు కూడా వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 847 సైనిక సంక్షేమ పెన్షన్ల కోసం రూ.42.35 లక్షలు విడుదల చేసింది ఆర్ధిక శాఖ. ఇదిలాఉంటే పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌బిఐఎస్ అమలు చేస్తున్నట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పెన్షన్లు ఆలస్యం కాకుండా చూడాల్సిన బాధ్యత గ్రామ సచివాలయాలదేనని అన్నారు.

Web Titleap pension october ist 2020 minister peddireddy ramachandraredy
Next Story