Amaravati Land Pooling: అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీం విధి విధానాలు జారీ

Amaravati Land Pooling Scheme
x

Amaravati Land Pooling: అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీం విధి విధానాలు జారీ

Highlights

Amaravati Land Pooling Scheme: రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ స్కీం - 2025 కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Amaravati Land Pooling Scheme: రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ స్కీం - 2025 కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ విధివిధానాల్లో భూములు ఇవ్వబోయే రైతులకు అందించనున్న ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రణాళికలు సమగ్రంగా వివరించబడ్డాయి.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అమరావతిలో మరో 40 వేల ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ నూతన స్కీంలో 2025 నిబంధనలు స్పష్టంగా ఉండేలా సీఆర్డీఏ (CRDA) ద్వారా నోటిఫికేషన్ రూపొందించనున్నారు. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. రైతులకు భద్రతతో పాటు, రాజధాని అభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలని ఈ స్కీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ తాజా స్కీం అమలులోకి వచ్చిన తర్వాత, అమరావతిలో భూసేకరణ మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories