ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. రూ.46,675 కోట్లతో

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. రూ.46,675 కోట్లతో
x
Highlights

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. రూ.46,675 కోట్లతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. రూ.46,675 కోట్లతో

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2022 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా వాటర్‌గ్రిడ్‌ పథకం ఏర్పాటు చేస్తోంది. రూ.46,675 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును చేపడుతున్నట్టు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో వాటర్‌గ్రిడ్‌ పథకంపై ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా రూ.46,675 కోట్లతో 2022 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామని వెల్లడించారు.

ఈ కుళాయిలు 30 ఏళ్ల పాటు వినియోగించుకునేలా తయారు చేస్తున్నట్లు తెలిపారు. రెండు దశల్లో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు. మరోవైపు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా భూగర్భజలాల వినియోగిస్తున్నారని... ఆ మూడు జిల్లాల్లో సర్ఫేస్‌ వాటర్‌ సరఫరాకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతానికి నీటిఎద్దడి ఉన్న చిత్తూరు, కడప, నెల్లూరు,ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్టు మంత్రులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories