తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లపై మంత్రి పేర్ని నాని స్పందన

తెలంగాణ సీఎం కేసీఆర్ కామెంట్లపై మంత్రి పేర్ని నాని స్పందన
x
Highlights

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని మరోసారి స్పష్టం చేశారు. ఏపీలో ఆర్టీసీని విలీనం చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంస్యమయ్యాయి

ఏపీలో ఆర్టీసీని విలీనం చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంస్యమయ్యాయి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చాలా అసాధ్యమని కేసీఆర్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి పేర్ని నాని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని.. దీనిపై ఏపీ ప్రభుత్వం మాత్రం పట్టుదలగా ముందుకు వెళుతోందని అన్నారు. ఆర్టీసీ సరైన సమయంలో ప్రజా రవాణా సంస్థగా మారుతుందని మంత్రి స్పష్టం చేశారు.

విజయవాడ ఆర్టీసీ ఆసుపత్రిలో హాస్టల్‌ను టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, "తెలంగాణ ఆర్టీసీలో జరిగిన పరిణామాలను మేము గమనిస్తున్నాము. అన్ని వ్యవస్థలు ప్రైవేటీకరించబడినప్పుడు కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప నిర్ణయం అన్నారు. తమ ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల వాగ్దానానికి అనుగుణంగానే విలీనం జరుగుతోందని, కెసిఆర్ మాటలను సానుకూలంగా తీసుకుంటామని పేర్ని నాని తెలియజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories