తిరుపతిలో ఓడిపోతే 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

Ap Minister Peddi Redy Ramachandra Reddy
x

పెద్దిరెడ్డి ఫైల్ ఫోటో

Highlights

Tirupati: తిరుపతి ఉపఎన్నికను అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి.

Tirupati: ఏపీలో రాజకీయలు వేడెక్కాయి. తిరుపతి ఉపఎన్నికను అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఓడిపోతే తామ పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని..తెలుగు దేశం పార్టీ ఓడిపోతే చంద్రబాబు ఆయన పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారా? అని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఈ ఎన్నికను తాము రెఫరెండంగా తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి విజయం సాధిస్తాడని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్మూధైర్యం ఎప్పుడూ లేదని విమర్శించారు. బీజేపీ,జనసేన, టీడీపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. బీజేపీకి ప్రజలను ధైర్యంగా ఓటు అడిగే హక్కు లేదని.. విభజన హామీలను నెరవేర్చకుండా ప్రజలను బీజేపీ నేతలు ఎలా ఓట్లు అడుగుతారంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ దత్తపుత్రుడని ఆరోపించారు. కోవిడ్‌ తీవ్రత వల్లే ఈనెల 14న సీఎం వైఎస్‌ జగన్‌ సభ వాయిదా వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలో చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ధైర్యంగా చెప్పగలుగుతున్నామని వ్యాఖ్యానించారు.

వైసీపీ అభ్యర్థిగా డా. గురుమూర్తి పోటీ చేస్తుండగా., టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పోటీ చేస్తున్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ చింతా మోహన్ పోటీ చేస్తున్నారు. ఈ నెల 17న తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. మే రెండోవ తేదీ తుది ఫలితం వెల్లడికానుంది. తెలుగు దేశంపార్టీ తరపున ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంటింటికి తిరిగి తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమ అభ్యర్థిని గెలిపించాలి విజయం కోసం శ్రమిస్తున్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని థీమా వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories