చంద్రబాబు వ్యాక్సిన్ వేయించుకున్నారో, లేదో చెప్పాలి: మంత్రి కన్నబాబు

Ap minister  Kanna babu slams Chandra babu
x

 Kanna babu (Thehansindia)

Highlights

Kanna babu:టీడీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబుపై విమ‌ర్శ‌లు సంధించారు..

Kanna babu: టీడీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబుపై విమ‌ర్శ‌లు సంధించారు వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు. వ్యాక్సిన్ల అంశంలో తీవ్ర విమర్శలు చేస్తున్న చంద్రబాబు ఇంతకీ వ్యాక్సిన్ వేయించుకున్నారా? లేదా? అని కన్నబాబు ప్రశ్నించారు వ్యాక్సిన్లపై కేంద్రమే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ పేర్కొంటున్న దాంట్లో తప్పేముందని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నారో, లేదో చంద్రబాబు ప్రజలకు చెబితే బాగుంటుందని అన్నారు.

కరోనా వ్యాక్సిన్ల అంశం కేంద్రానికి సంబంధించిన అంశమే అని తెలిసి కూడా టీడీపీ నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. 45 ఏళ్లు దాటిన వాళ్లు వ్యాక్సిన్ వేయించుకోవాలి కదా... చంద్రబాబు ఏంచేశారు? అంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ చంద్రబాబు వ్యాక్సిన్ వేయించుకుంటే ఎక్కడ వేయించుకున్నారు? ఏపీలోనా? తెలంగాణలోనా? కొవాగ్జిన్ వేయించుకున్నారా? కొవిషీల్డ్ వేయించుకున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories