ఐటీ రైడ్స్‌పై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు

ఐటీ రైడ్స్‌పై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు
x
బొత్స సత్యనారాయణ ఫైల్ ఫోటో
Highlights

అవినీతి ఆరోపణలకు సంబంధించి అధికారిపై సస్పెన్షన్ వేటు పడిందని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

అవినీతి ఆరోపణలకు సంబంధించి అధికారిపై సస్పెన్షన్ వేటు పడిందని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తర్వలోనే మరో అధికారిపై ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్‌కు గురైన సంగతి తెలిసిందే. సోమవారం విశాఖలో మీడియాతో మంత్రి బొత్స మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రతి ఒక్కటి చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే చంద్రబాబు దానిని తప్పుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారి సప్పెన్షన్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న చంద్రబాబునాయుడు ఐటీశాఖ దర్యాప్తులపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గత ఐదు రోజులుగా చంద్రబాబు వద్ద పర్సనల్ సెక్రటరిగా పనిచేసిన శ్రీనివాస్‌పై ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వేటు పడిన అధికారి ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ప్రభుత్వ అధికారిపై కేంద్రం వచ్చి ఐటీ రైడ్స్ చేస్తుందంటే పరిస్థితిని అర్థం ఏంటో చేసుకోవచ్చని మంత్రి బొత్స తెలిపారు. దీనిపై చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

ప్రభుత్వం వేటువేసిన చేసిన అధికారి గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు గాని,ఐటీ రైడ్స్‌పై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలనన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. రాజధానిపై వ్యాపారవేత్తలతో చంద్రబాబు గతంలో నారాయణ కమిటీ వేశారని

ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రాంతాన్నే రూ. లక్షా కోట్లతో అభివృద్ధి చేస్తే ఏలా అయన ప్రశ్నించారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి ఉత్తరాంధ్ర అభివృద్ధి అవసరం లేదా అని ప్రశ్నించారు. హైద్రబాద్ కు ధీటుగా విశాఖను తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు.

విశాఖలో భూసేకరణ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 6 లక్షల పెన్షన్లు పెరిగాయని చెప్పారు. పెన్షన్లు అనర్హులుగా గుర్తించిన వారికి మళ్లీ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories